లెక్కల్లో చూపని ఆదాయం జమ: ఐటి గుర్తింపు

it
Income Tax Dept. obsere the Deposites in Bank Accounts

లెక్కల్లో చూపని ఆదాయం జమ: ఐటి గుర్తింపు

 

న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్లను ఆదాయ పన్ను శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.. బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో లెక్కలు చూపని ఆదాయం జమైందని గుర్తించారు.. పన్ను చెల్లించని సొమ్ము విలువ సుమారు రూ.4లక్షల కోట్లు ఉంటుందని ఐటి శాఖ వెల్లడించింది.. రూ.10,700 కోట్లు ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాల్లో జమైనట్టు గుర్తించారు. మొత్తం 80 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాల్లో ఎక్కువ సొమ్ము జమైందని, పేర్కొన్నారు..

నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 30 మధ్య రూ.25 వేల కోట్లు జమచేశారని, రూ.80 వేలకోట్ల విలువైన రుణాలను చెల్లించారని ఐటి పేర్కొంది.. కాగా సహకార బ్యాంకు ఖాతాల లావాదేవీలపైన కూడ ఐటి శాఖ దృష్టిసారించింది.. దేశంలోని వేర్వేరు సహకార బ్యాంకు ఖాతాల్లో రూ.16 వేల కోట్లు జమయ్యాయని పేర్కొంది.. డిపాజిట్‌ చేసిన సొమ్ముకు అధికారులు ఖాతాదారులను లెక్కలు అడుగుతున్నారు.. ఖాతాదారులు వివరణ సరిగా లేకపోతే ఆయా శాఖల చర్యలకు సిద్ధమవుతున్నారు.