లూధియానాలో ఘోర అగ్ని ప్ర‌మాదం, కుప్ప కూలిన భ‌వ‌నం!

Fire Incident in ludhiyana
Fire Incident in ludhiyana

లూధియానా: పంజాబ్‌లోని లూధియానాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లూధియానాలోని ముస్తాఖ్‌నగర్‌లో గల ప్లాస్టిక్ సంచులు త‌యారు చేసే ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ధాటికి భవనం కుప్పకూలి ముగ్గురు దుర్మరణం చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 10 అగ్నిమాపక యంత్రాలతో గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా ఆ మూడంతస్తుల భవనంకుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో పలువురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.