లాసెట్‌, ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పు

online exam
online exam

హైదరాబాద్‌: ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నాలుగు ప్రవేశ పరీక్షల తేదీలు మారాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్‌) కన్వీనర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ వివిధ జాతీయ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని కొన్ని పరీక్షల తేదీలను మార్చామన్నారు. ప్రతి పరీక్షకు ప్రత్యేక సాంకేతిక అధికారిని నియమించాలని టీసీఎస్‌, టీఎస్‌ ఆన్‌లైన్‌ అధికారులకు సూచించామన్నారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా నమూనా ఆన్‌లైన్‌ పరీక్షలు జరుపుతామని చెప్పారు. దరఖాస్తు రుసుములను ఆయా కన్వీనర్లు నిర్ణయించుకుంటారని, ఒకవేళ పెరిగినా స్వల్పంగానే ఉంటుందన్నారు. ఈసారి ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పోలీసు అధికారులతో చర్చిస్తామన్నారు.
• ఎడ్‌సెట్‌ను తొలుత ప్రకటించినట్లుగా మే 30, 31 తేదీల్లో కాకుండా మే 31నే ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహిస్తారు.
• ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీఈసెట్‌ను మే 2729వ తేదీ వరకు కాకుండా మే 2831 వరకు జరుపుతారు.
• బీపీఎడ్‌ కోర్సులకు పీఈసెట్‌ మే 20 నుంచి కాకుండా మే 15వ తేదీ నుంచే మొదలవుతుంది.
• మే 26న జరగాల్సిన లాసెట్‌ పరీక్షను మే 20న నిర్వహిస్తారు.