లారీ యాజ‌మానుల స‌మ్మె విర‌మ‌ణ‌

Lorry's strike
Lorry’s strike

అమ‌రావ‌తిః ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చేపట్టిన లారీ, ట్రక్కుల యజమానుల సమ్మె విరమించారు. సమస్యలు పరిష్కరించాలని లారీ యజమానులు దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మె విరమించినట్లు ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు ప్రకటించారు. కేంద్ర రవాణాశాఖతో ఏఐఎంటీసీ చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. వెంటనే సమ్మె విరమించాలని కేంద్ర రవాణాశాఖ సంయుక్త కార్యదర్శి అబే డామ్లే కోరారు. అబే డామ్లే విజ్ఞ‌ప్తికి ఏఐఎంటీసీ స్పందించింది.