లాభాల బాట‌లో మార్కెట్లు

stock market
stock market

ముంబైః దేశీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. ఉదయం వందకు పైగా పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ లాభాల జోరు కొనసాగించింది. ఒక దశలో 237.88 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. చివరకు 165.87 పాయింట్ల లాభంతో 34,616.64 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఉదయం 10,600 వద్ద ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 46.20 పాయింట్ల లాభంతో 10,630.90 పాయింట్లకు చేరింది. చివరకు 29.65పాయింట్ల లాభంతో 10614.35పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.37వద్ద ట్రేడవుతోంది.