లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు

stock market
stock market

ముంబైః దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈ వారంలో వెలువడబోయే దేశీయ కార్పొరేట్‌ సంస్థల ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక ఫలితాలపై సానుకూలంగా ఉన్న మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. అటు నిఫ్టీ కూడా 10,800 మార్క్‌ పైన ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 9.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 174 పాయింట్ల లాభంతో 35,832 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 10,824 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ కాస్త కోలుకుని రూ. 68.61గా కొనసాగుతోంది. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటాస్టీల్‌, రిలయన్స్‌, యస్‌ బ్యాంక్‌ తదిరత షేర్లు లాభాల్లో ఉండగా.. టీసీఎస్‌, టైటాన్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.