లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

stocks
stocks

ముంబై: స్టాక్‌ మార్కెట్లకు మళ్లీ లాభాల కళ వచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం, కేంద్రం-ఆర్‌బిఐ మధ్య నెలకొన్న విభేదాలతో ఈ ఉడయం భారీ ఊగిసలాటతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత సూచీలు పుంజుకున్నాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 163 పాయింట్లకు పైగా లాభపడింది. మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 551 పాయింట్లు ఎగబాకి 34,442 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 188 పాయింట్ల లాభంతో 10,387 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో మళ్లీ 74 స్థాయిని దాటిన రూపాయి ఆ తర్వాత కాస్త కోలుకుని 73.97గా కొనసాగుతుంది.