లాభాల్లో ముగిసిన ఈక్విటీ

sensex
BSE SENSEX

లాభాల్లో ముగిసిన ఈక్విటీ

వాతావరణ అంచనాలే కీలకం

ముంబయి, మే 14: తొలుత వేసిన అంచ నాలను మించుతూ అత్యధిక వర్షపాతానికి అవకాశం ఉందన్న వాతావరణశాఖ అంచనాలతో గత వారం స్టాక్‌ మార్కె ట్లు లాభాల్లోనే ముగిసాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో మార్కెట్లు ఒకటి శాతానికిపైగా పెరిగాయి. సెన్సెక్స్‌ 329పాయింట్లు పెరిగి 30,88 వద్దముగిస్తే ఎన్‌ఎస్‌ఇ ప్రామాణిక సూచి నిప్టీ 50సూచి కూడా 116 పాయింట్లు పుంజుకుని 9401 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఏప్రిల్‌లో అమ్మకాలకే ప్రాధాన్యంఇచ్చిన విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు గత వారంలో తిరిగి కొనుగోళ్లు పెంచారు. దీనితోమార్కెట్లకు లాభాలు వచ్చిపడ్డాయి. అంతేకాకుండా మార్కెట్లు పటిష్టం అయ్యాయన్నది నిపుణుల అంచనా. నాలుగురోజుల్లోనే రెండువేల కోట్లకుపైగా ఎఫ్‌పిఐలు పెట్టుబడులు పెట్టారు. నాలుగు ట్రేడింగ్‌లలోనే ఎక్కువ కొనుగోళ్లు జరిగితే ఒక్కశుక్రవారం రోజే రూ.842 కోట్లు కొనుగోళ్లు జరిగాయి. దేశీయ ఫండ్స్‌ వారాంతంలో రూ.711 కోట్ల విలతువైన స్టాక్స్‌ విక్రయిం చాయి. సాధారణ సగటుకు మించినవర్షపాతం నమోదతైన గ్రామీణప్రాంతాల ఆదాయం పుంజుకునే వీలుంటుంది. దీనితోప్రధానంగా ఎఫ్‌ఎంసిజి, ఆటోరంగాలు లబ్దిపొందుతాయి. దేశ ఆదాయంలో ప్రధాన వాటా వ్యవసాయం అనుబంధపరిశ్రమల ద్వారానే లభిస్తోంది సగటుకు మించిన వర్షపాతం దేశ ఆర్థికవ్యవస్థకు ఊతం ఇస్తుందని అంచనా. వీటికితోడు ఫ్రెంచ్‌ అధ్యక్ష ఎన్నికల్లో మ్యాక్రన్‌ విజయం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల సెంటిమెంట్‌కు మద్దతునిచ్చింది. గతవారంలో ఐటిరంగం 2.8శాతం, ఆటోరంగం 3.3శాతం పెరిగాయి. బిఎస్‌ఇలోమిడ్‌క్యాప్‌ స్మాల్‌క్యాప్‌సూచీలు ఒకటిశాతం వృద్ధిసాధించాయి. బ్లూచిప్స్‌కంపెనీల్లో ఎయిర్‌టెల్‌, హీరోమోటో, సిప్లా, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, అదానిపోర్ట్స్‌, హెచ్‌యుఎల్‌ 3-6శాతం పెరిగితే గెయిల్‌ మాత్రం 2.5శాతం నీరసించింది.