లాభాలివ్వని ఐడియా

idea
idea

లాభాలివ్వని ఐడియా

ముంబయి, మే 15: రిలయన్స్‌జియో దెబ్బకు మరో సెల్యులర్‌కంపెనీ విలవిలలాడుతోంది. దేశంలో మూడో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఐడియాసెల్యులర్‌ కంపెనీకి నాలుగోత్రైమాసికంలో నష్టాలు ఎదుర య్యాయి. పోటీ సంస్థ అందిస్తున్న ఉచిత సేవల వల్ల అమ్మకాలను, మార్జిన్‌లను కూడా దెబ్బతీసిం ది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికామ్స్‌ వెంచర్‌ జియో గత ఏడాదినుంచే ఆఫర్లుప్రారంభించింది. దీనితో ఇతర సంస్థలపరంగా భారీ యుద్దానికి దారితీసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ఫోన్‌ మార్కె ట్‌గా ఉన్న భారత్‌ టెలికాం రంగంలో కారుచౌక సేవల ప్లాన్లతో సంస్థలు పోటీపడుతున్నాయి.

దీని తో ఆయా సంస్థల లాభదాయకత, రాబడులపై కూడా విపరీత ప్రభావం చూపిస్తోంది. ఆదిత్యబిర్లా కీలక కంపెనీ ఐడియా నికరనష్టం 328 కోట్లుగా ప్రకటించింది. మార్చి31తో ముగిసినత్రైమాసికంలో గత ఏడాది నికరలాభం 452కోట్లు ఆర్జించిన కంపె నీ ఈసారి నష్టాలు చవిచూసింది. డాలర్లలో చూస్తే 51.6 మిలియన్‌ డాలర్లుగా ఉంది. మార్కెట్‌ నిపు ణుల అంచనాలను చూస్తే ఐడియా 714 కోట్ల నష్టం చవిచూస్తుందని థామ్సన్‌ర్యూటర్స్‌ అంచనా వేసింది. ఐడియాగ్రూప్‌ నికరనష్టం కీలకమైన టెలికాం కార్యకలాపాలనుంచే ఎక్కువ ఉంది. టెలి కాం టవర్‌ జాయింట్‌ వెంచర్‌ను కలపకపోయినా గరిష్టంగా 430 కోట్ల నష్టం ఉందని అంచనావేసిం ది. కొత్త వెంచర్‌ ఛార్జీలు ప్రారంభించడంతో క్రమేపీ ఇతర సంస్థలకు ఉన్న నష్టాలు కూడా తగ్గవచ్చన్న అంచనాలున్నాయి.

ఐడియా వాయిస్‌టారిఫ్‌లను 12.5శాతం డేటాధరలను 27.6శాతం తగ్గించింది. గడచిన డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఎక్కువే. నికర అమ్మకాలు 14.3శాతం క్షీణించి 8110 కోట్ల కు చేరింది. భారత్‌లోని టాప్‌ టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ ఈ వారంలోనే స్వల్పస్థాయిలో త్రైమాసిక లాభాలను ప్రకటించింది. జియో ఇతర సంస్థలకు గట్టిపోటీఇవ్వడంతో ఇతరసంస్థలకు నష్టా లు అనివార్యం అవుతున్నాయి. వొడాఫోన్‌ భారత్‌ విభాగం 23బిలియన్‌ డాలర్ల విలీనాన్ని ఆమోదిం చింది. భారతిఎయిర్‌టెల్‌కూడా నార్వేజియన్‌ సంస్థ టెలినార్‌ను ఆరు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తోంది.