లాభాలల్లో అస్ట్రా మైక్రోవేవ్‌

Astra Microwave
Astra Microwave

హైదరాబాద్‌: అస్ట్రా మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.. 111.52కోట్ల ఆదాయాన్ని, రూ.. 20.72 కోట్ల నికరలాభాన్ని పొందింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ. 50.68 కోట్లు ఉండగా, అప్పట్లో దానిపై రూ. 4.63 కోట్ల నికర నష్టాన్ని భరించాల్సి వచ్చింది. దీంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నట్లు స్పష్టమౌతుంది. సెప్టెంబరు మాసం ఆఖరు నాటికి కంపెనీ చేతిలో రూ.. 1,214 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. సమీక్ష త్రైమాసికంలో రూ. 194 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/