లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

stock market
stock market

ముంబాయి: గురువారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఆటోమొబైల్‌ సహా దాదాపు అన్ని రంగాల్లో ఇన్వెస్టర్లు
కొనుగోలుకు మొగ్గుచూపడం, ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావం కూడా కలిసి రావడంతో సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌
మళ్లీ 33వేల మైలురాయికి చేరువవగా, నిఫ్టీ 120పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 80పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను అరంభించిన సూచీ మార్కెటు ముగిసే సమయానికి 352పాయింట్లు ఎగబాకి 32,949 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 123పాయింట్ల లాభంతో 10,167
వద్ద ముగిసింది.