లాడ్‌బ‌జార్‌లో ఇవాంకా గాజులు

Bangles
Bangles

ఇవాంక రాక‌తో భాగ్య‌న‌గ‌రంలో సంద‌డి మొద‌లైంది. ఒక వైపు డేగ క‌ళ్ల‌తో పోలీసులు ప‌హారా కాస్తుంటే.. మ‌రోవైపు చార్మినార్ ద‌గ్గ‌ర ఇవాంకా పేరుతో జోరుగా వ్యాపారం జ‌రుగుతోంది. ఇవాంకా చార్మినార్ వ‌ద్ద షాపింగ్ చేయ‌నుంద‌ని వ‌చ్చిన వార్తలు విన్న వ్యాపార‌స్తులు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెట్టి ప్ర‌త్యేక డిజైన్ల‌తో గాజులు త‌యారు చేశారు. ప్ర‌స్తుతం చార్మినార్ దగ్గ‌రి లాడ్‌బ‌జార్‌లో ఇవాంకా పేరుతో ఉన్న‌ గాజులు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. అంతేకాకుండా భార‌త‌, అమెరికా జాతీయ జెండాల‌తో గాజులపై డిజైన్లు వేసి అమ్ముతున్నారు. ఆమె ఇక్క‌డ షాపింగ్ చేస్తుందో లేదో స్ప‌ష్ట‌త లేదు కానీ ఆమె పేరుతో వ్యాపారం మాత్రం జోరుగానే సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.