లాజిస్టిక్‌ పార్క్‌లకు శంకుస్థాపన చేసిన కేటీఆర్‌

TS Minister Ktr
TS Minister Ktr

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు  భారీ పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు రెండు లాజిస్టిక్‌  పార్క్‌లను అభివృద్ధి చేయనున్నారు. వస్తువుల రవాణాకు, ఎగుమతి దిగుమతులకు అనుకూలంగా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో నాగార్జునసాగర్‌ హైవేపై ఒకటి, విజయవాడ హైవేపై మరోకటి నిర్మించనున్నారు. వీటికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌  శంకుస్థాపన చేశారు. పీపీపీ పద్దతిలో బాటాసింగారంలో రూ.35కోట్లతో, మంగల్‌పల్లిలో రూ.20కోట్లతో మరో పార్క్‌ను  నిర్మించనున్నారు.