లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన జొకోవిచ్‌

novak djokovic
novak djokovic

బార్సిలోనా: కరోనా మహామ్మారి కారణంగా యావత్‌ ప్రపంచం స్థంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడా టోర్నీలు రద్దు అవడమో లేక వాయిదా పడడమో జరుతున్నాయి, దీంతో ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. ప్రపంచంలో కరోనా భారిన పడి భారీ నష్టం చవిచూస్తున్న దేశాలలో స్పెయిన్‌ ఒకటి, దీంతో ఇక్కడ కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ ను అమలు చేస్తున్నారు. అయితే తాజాగా సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి క్లేకోర్టులో మరో వ్యక్తితో కలిసి ప్రాక్టిస్‌ చేసుకుంటున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. కాని సెర్బియాలో ప్రోఫెషనల్‌ ఆటగాళ్లు కోచ్‌ ఆధ్వర్యంలో లేదా… తామంతట తాముగా వ్యాయామాలు చేసుకునే వెసులుబాటు ఉంది కాని మరో వ్యక్తితో కలిసి ప్రాక్టిస్‌ చేసుకునే అనుమతి లేదు అని స్పానిష్‌ టెన్నిస్‌ సమాఖ్య తెలిపింది. ఈ నేపథ్యంలో అతనిపై ఆంక్షలు విధిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/