లాక్‌డౌన్‌ సమయంలో దేవాలయాలు ఎందుకు తెరిచారు?

టిడిపి నేత భూమా అఖిలప్రియా

akhila priya
akhila priya

కర్నూలు: వైయస్‌ఆర్‌సిపి నేతలపై టిడిపి మహిళా నేత భూమా అఖిలప్రియా మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అహోబిళం నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి ఎలా వెళ్లారు . లాక్‌డౌన్‌ లో అన్ని దేవాలయాలు మూసివేసినప్పటికి వైయస్‌ఆర్‌సిపి నాయకుల కోసం ఎందుకు దేవాలయాలు తెరిచారు?. అంటూ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఇవాళ స్వాతి నక్షత్రం సందర్బంగా ఎంతో మంది ప్రజలు అహోబిళం నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వస్తారు, కాని లాక్‌డౌన్‌ వల్ల మూతబడిన దేవాలయాలు వైస్‌ఆర్‌సిపి నేతల కోసం ఎందుకు తెరిచారు?. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి స్వామివారిని దర్శించుకునేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెళ్లారు. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అఖిల ప్రియ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయడి: https://www.vaartha.com/news/sports/