లాంచీ ప్ర‌మాదం బాధాక‌రంః ప‌వ‌న్

Pawan kalyan
Pawan kalyan

తిరుప‌తిః తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పందించారు. లాంచీ ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పవన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలవాలని పవన్‌ సూచించారు. నిన్న సాయంత్రం దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరి లాంచీ మునిగిన ఘటనలో 45 మంది గల్లంతయ్యారు. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలిలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.