లగడపాటి సర్వే తప్పు

buddha venkanna
buddha venkanna, tdp mlc

అమరావతి: ఏపిలో లగడపాటి రాజగోపాల్‌ సర్వే కరెక్ట్‌ కాదని..తమకు 130 సీట్లు వస్తున్నాయని అందులో ఎలాంటి అనుమానమూ లేదన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ఓడిపోతుందని జగన్‌కు కూడా తెలుసని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. లగడపాటి అంచనాలను మించి తమకు సీట్లు వస్తాయన్నారు. సర్వేలు చాలా చోట్ల అంచనాలు తప్పుతున్నాయని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఎన్డీఏకి బాగా తక్కువ సీట్లు వస్తున్నాయన్నారు. ఐతే ఎగ్జిట్‌ పోల్స్‌లో కావాలని మోది హైప్‌ చేయించారని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపికి అనుకూలంగా ఇచ్చిన సర్వేలు మోది ఆదేశాల మేరకే అలా చెప్పాయన్నారు. అధికారంలోకి వస్తున్నామని వైఎస్‌ఆర్‌సిపి మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్నారు. మహిళలంతా టిడిపికే ఓట్లు వేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/