లక్ష జరిమానా, రోజంతా కోర్టు మూలన కూర్చొవాలి

nageswara rao
nageswara rao

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకు పాల్పడిన మాజీ సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌ ఎం నాగేశ్వరరావుకు సుప్రీం ఓ వింత శిక్షను విధించింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బీహార్‌ షెల్టర్‌ హొం కేసును విచారిస్తున్న సిబిఐ అధికారిని బదిలీ చేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐతే ఈ విషయంపై నాగేశ్వరరావు సుప్రీంను క్షమాపణలు కూడా అడిగారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించే ఉద్దేశం తనకు లేదని అన్నా కాని సుప్రీం ఆయన వినతిని పట్టించుకోలేదు. అంతేకాగ ఆయనకు ఓ వింత శిక్షను విధించింది. రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోవాలని, రూ. లక్ష జరిమానా కట్టాలని ఆదేశించడం విశేషం. నాకు నచ్చింది చేస్తా అన్నట్లుగా ఆయన తీరు ఉందని, ఇది సహించరానిదని ఇది ముమ్మాటికి కోర్టు ధిక్కారమేనని సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ముగిసే వరకు ఓ మూలన కూర్చోవాలని, రూ. లక్ష జరిమానా విధిస్తున్నాం అని ఆదేశిస్తున్నట్లు సిజెఐ రంజన్‌ గొగో§్‌ు స్పష్టం చేశారు.