లక్ష్యాలకు దూరమౌతున్న హరిత విప్లవం

GREEN REVOLUTION
GREEN REVOLUTION

లక్ష్యాలకు దూరమౌతున్న హరిత విప్లవం

హరిత విప్లవ లక్ష్యాలు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో రైతులు ఏఏ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో పాలక వర్గాలు అధికార యంత్రాంగం సరిగ్గా అధ్య యనం చేయడం లేదు. పండిన పంటలకు తగిన గిట్టుబాటు ధరలు అందేలా చూస్తేనే ఆర్థికంగా అన్నదాత నిలదొక్కు కోగలుగుతాడు.

రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర రానప్పుడు ప్రభుత్వమే చొరవ తీసు కుని ఆయాపంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.అంతేకాదు దానికి తగ్గట్టు పంటలను నిల్వచేసుకోడానికి వీలుగా గొడౌన్లును ఆధునీక రించి శీతలీకరణ గిడ్డంగులుగా రూపొందించాలి. నేలసారం క్షీణించి నప్పుడు శాస్త్ర వేత్తల సమష్టి సహకారంతో ఆనేలను సారవం తం చేసేలా ప్రయో గాలను అమలు చేయాలి.ఉత్పత్తులను రెట్టింపు చేసే వంగడాలు రైతులకు అందుబాటులో ఉండేలాచర్యలు తీసుకోవాలి. ఇక్కడ దళారీల ప్రమేయం కానీ ప్రైవేటు సంస్థల జోక్యం కానీ ఉం డకూడదు. ప్రభుత్వమే నేరుగాబాధ్యత వహించాలి.కానీ ఇవన్నీ కాగి తాలకే పరిమితమవ్ఞతున్నాయితప్ప కార్యాచరణలోకిరావడం లేదు. హరిత విప్లవం కారణంగా దేశ వ్యవసాయ ముఖచిత్ర మే మారి పోయింది.సంప్రదాయ సేద్యం ఒక్కసారిగా ఆధునిక రూపు సంత రించుకుంది. ముఖ్యంగా వరి, గోధుమ పంటల్లో హరిత విప్లవం పెను మార్పులనే తెచ్చింది. పంటల సరళీ అనూహ్యంగా మారింది. ఉత్పత్తి ఉత్పాదకతల్లో కదలిక మొదలైంది. యాంత్రీకరణ విస్తరిం చడంతో సేద్యపనుల్లో వేగం పెరిగింది.ఆధునిక వ్యవసాయానికి అం కురార్పణ జరిగింది. వరి,గోధుమ పంటల్లో సంప్రదాయకంగా రైతు లు ఊహించని విధంగా రెట్టింపు దిగుబడులు సాధ్యపడ్డాయి.హరిత విప్లవం వచ్చాక అధిక దిగుబడుల కోసం సంప్రదాయకంగా వాడే పశువ్ఞల పేడస్థానే రసాయన, క్రిమిసంహారకాల వాడకం పెరిగింది. ఇది దిగుబ డుల్ని ప్రభావితం చేస్తుండటం రైతుల్ని ఆకర్షించింది.

సంప్రదాయ పద్ధతులకు తిలోదకాలివ్వడం అప్పుడే మొదలైంది. అయితే హరిత విప్లవం కొన్ని పంటలకే ముఖ్యంగా వరి,గోధుమ వంటి పంటలకే పరిమితమైందనే ఆరోపణలు ఎక్కువగా రైతుల నుంచి వస్తున్నాయి.ఏదేమైనా సంప్రదాయ పంటలైన జొన్న, సజ్జ, కొర్ర రాగులతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలకు ఆద రణ తగ్గింది. ఈ పంటల విస్తీర్ణం క్షీణించడంతోపాటు ప్రజల్లో వాటి వినియోగం సైతం తగ్గడంతో మన ఆహారంలో పోషకాహార స్థాయి పడిపోయింది. అనారోగ్యసమస్యలు రానురాను పెరుగు తున్నాయి.

ఇది ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసింది. హరిత విప్లవంతో సాధించిన ప్రగతి కొన్ని రంగాలకే పరిమితం కాగా, అది తెచ్చిన అనర్థాలు విస్తృతస్థాయిలోనష్టాలు కలిగిస్తున్నాయి. హరిత విప్లవం తరవాత దేశం ఆహారోత్పత్తుల్లో స్వావలంబన సాధించిన మాట నిజమే కానీ అదే సమయంలో రైతుల ఆదాయాలూ మరింత క్షీణిం చాయి.దేశానికి ఆహార ధాన్యాలు అందించే రైతులు ఒకపూట తిండి కి నోచుకోలేని పరిస్థితులు దాపురించాయి.ఆహారభద్రత చట్టం తీసు కొచ్చినా, లక్ష్యాలసాధనకు కీలకమైన అంశాలను ప్రభుత్వాలు పట్టిం చుకోకపోవడం శోచనీయం.

ఎంతసేపూ ఉత్పత్తి, పంపిణీ గురించే తప్పఆ ఉత్పత్తి సాధనకు అనుసరించాల్సిన వ్యూ హాలపై శ్రద్ధ పెట్ట డం లేదు. గ్రామస్థాయిలో విస్తరణ యంత్రాంగం అందుబాటులో లేకపోవడం పెద్దలోపం. మన అవసరాలెంత, ఎంత పండించాలి, ఏ మేరకు పండిస్తే ఎంతెంత ధరలొస్తాయని చెప్పేవారే లేరు.

గ్రా మీణ రైతుస్థాయికి సాగు సలహాలందడం లేదు. ప్రభుత్వం నిర్ణ యించిన మద్దతు ధరలూ రైతుకు దక్కడం లేదు.పంట నూర్చినప్పు డు ధరలు పడిపోతాయి.కొద్ది నెలల తరువాత మళ్లీ పెరుగుతాయి. తెచ్చిన అప్పులు తీర్చేందుకు 80 శాతం రైతులు కల్లాంలోనే పంట ను తెగనమ్ముకుంటున్నారు.

లాభమంతా వాటిని కనిపెట్టుకున్న వ్యాపారులకు చేరుతోంది. ఇలా అన్నింటా దోపిడీపర్వంతో దేశంలో అత్యధిక శాతం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని జాతీ య సర్వేలు తేల్చి చెప్పాయి. ఏడేళ్ల క్రితం 2009-10లో క్వింటా వడ్లు ఉత్పత్తి చేయాలంటే రూ.645 ఖర్చయ్యేది.

2015-16 నాటికది రూ. 1,324కు పెరిగిం ది.నేటికి క్వింటా వడ్లకు మద్దతు ధర రూ. 1,410కి మాత్రమే చే రింది. ఇదంతా ప్రభుత్వ లెక్క.వాస్తవ ఖర్చులు పరిశీలిస్తే ఇంకెంతో ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా చూ సినా ఖర్చుకు, ఆదాయానికి పెద్ద వ్యత్యాసం లేదన్న సంగతి సు స్పష్టం.కొన్ని పంటల సాగులో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న భా రత్‌, అవేపంట ఉత్పత్తుల్ని సొంత అవసరాల కోసం చిన్న చిన్న దే శాల నుంచి దిగుమతి చేసు కోవాల్సిన దుస్థితి ఏర్పడటం దారుణం.

ఈ పరిస్థితుల్లో ఉత్పత్తులు పెంచడంతోపాటు వాటికి విలువ జోడించడమూ అత్యంత కీలకం. అందుకు తగిన అవకాశాలను కల్పించాల్సి ఉంది. ఆ దిశగా రైతుల వద్దకు వెళ్లి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించలేకపోతున్నారు. రాష్ట్రా ల వారీగా వివిధపంటల్ని అధికంగా పండించే ప్రాంతాలను గుర్తించి వాటిని క్లస్టరుగా విభజించి విలువ జోడింపు పరిశ్రమలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృతంగా ఏర్పాటయ్యేలా చూడాలి.్పు ్తృతంగా ఏర్పాటయ్యేలా చూడాలి.

– ఎన్‌.మోహన్‌రావు