లక్ష్యసాధనలో ఓటమే గెలుపు

happy
happy

లక్ష్యసాధనలో ఓటమే గెలుపు

మా అమ్మాయిని డాక్టర్‌ చేద్దామనుకుంటే రోగిలా మారింది. కడుపునిండా తినలేకపోతున్నది. కళ్ల మూసుకుని నిద్రపోవడానికి భయపడుతున్నది. అన్నీ పోగొట్టుకున్న వ్యక్తిలా దీనంగా కనిపిస్తున్నది. నీరసం, నిస్పృహ, నిరాశ ఆవహించి జీవచ్ఛవంలా మారిపోయింది. ఉన్న ఒక్క కూతురు అలా మారిపోవడాన్ని చూసి నేను, మావారు తట్టుకోలేకపోతున్నాం. ఆమెను పూర్తిగా మార్చి, డాక్టర్‌ను చేసే మార్గం చూపండి. మా అమ్మాయికి ఇప్పుడు 16 ఏళ్లు. ఇంటర్‌ బైపిసి రెండవ సంవత్సరంలోకి వచ్చింది. మాది మధ్యతరగతి కుటుంబం కావడంతో బతుకుతెరువ్ఞ కోసం దుబా§్‌ు వెళ్లాం. నేను, మావారు అక్కడే ఉద్యోగం చేస్తున్నాం. పాపకూడా అక్కడే పుట్టింది.

అయితే అక్కడ చదివించడం కంటే మన ప్రాంతంలోనే చదివించడం మంచిదని భావించాం. అందుకని హైదరాబాద్‌లో నివసిస్తున్న మా అమ్మ, నాన్నకు అందుబాటులో ఉండేలా పేరున్న కాన్వెంటులో చేర్పించాం. వారం, వారం వారెళ్లి పాపను చూసుకునేవారు. ఆమెతో పాటు హైదరాబాద్‌లో వ్ఞన్న మా చెల్లి ఆమె భర్త కూడా నా కూతురి క్షేమసమాచారాలు చూసుకుంటున్నారు. అమ్మాయి చాలా తెలివితేటలు గలది. పైగా అందరికంటే చలాకీగా ఉంటుంది. ఒకటవ తరగతి నుంచి పదవతరగతి వరకు క్లాసులో ఆమెదే మొదటి స్థానం వచ్చేది. పదవ తరగతిలో రాష్ట్రస్థాయి ర్యాంకు కూడా సాధించింది. ఇంటర్‌లో చేర్పించిన తర్వాత ఆమెలో ఏదో తెలియని భయం ప్రారంభమయ్యింది. హాస్టల్‌ భోజనం పడటం లేదన్నది. అక్కడి పిల్లలు రాత్రుల్లో సరిగా చదవడం లేదని, పైగా తనను కూడా చదవనీయడం లేదని చెప్పింది. దీంతో కాలేజీ వారితో మాట్లాడి డేస్కాలర్‌గా మార్పించాం. అమ్మదగ్గరే వ్ఞంచి రోజు కాలేజి బస్సులో వెళ్లి వచ్చే ఏర్పాటు చేశాం.

అయినా ఆమె రోజురోజుకు తగ్గిపోతున్నది. ఉదయం టిఫిన్‌ తినమంటే ఆకలి కావడం లేదని చెప్పడం ప్రారంభించింది. బలవంతంగా రెండు ఇడ్లీలు పెట్టినా తినలేకపోతున్నది. మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అంతే. బలవంతం చేసి తినిపిస్తే వాంతి చేసుకునేది. దీంతో డాక్టర్‌ వద్దకు తీసుకెళితే ఏవో సిరఫ్‌ రాసిచ్చారు. అది వాడితే కొతమేరుగయినట్టు కనిపించినా, మందు మానేస్తే మళ్లీ మొదటికే. సరిగా తినలేకపోయినా పట్టుదలతో చదువ్ఞకుంటున్నది. రాత్రుల్లో మధ్యమధ్యలో కూడా లేచి చదువ్ఞతుంది. అన్నింటా తానే నెంబర్‌ వన్‌ కావాలన్నదే ఆమె లక్ష్యం. ఎక్కువగా చదవడం వల్ల సైట్‌ వచ్చింది. కళ్ల డాక్టర్‌కు చూపించి కళ్లజోడు తీసిచ్చాం. కొన్నాళ్ల తరువాత తలనొప్పి, నీరసం అంటూ బాధపడుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఏదోవిధంగా మొదటి సంవత్సరం పూర్తి చేయించాం. పరీక్షల ఫలితాలు ఆమె అనుకున్నట్టు రాలేదు. దీంతో మూడురోజులు ఏడుస్తూ కూర్చున్నది. ఏదోవిధంగా సముదాయించాం. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన తన ముఖం చూపించలేక కాలేజీకి పోనంటున్నది.

తానెందుకు పనికిరానని, చనిపోతే మంచిదని ఏవేవో పిచ్చిమాటలు మాట్లాడుతున్నది. ఎంతసేపు తన గదిలోనే ఉంటున్నది. ఎన్ని మందులు వాడుతున్నా మార్పు రాకపోవడంతో సైకాలజిస్టుకు చూపమని డాక్టరే చెప్పారు. మా అమ్మాయిని మామూలు మనిషిగా మార్చి డాక్టర్‌ను చేయడానికి మార్గం చెప్పండి. – ప్రభావతి, దుబామ్‌ (హైదరాబాద్‌)

అమ్మా, మీ అమ్మాయి చాలా తెలివైనదనడంలో సందేహం లేదు. అలాగే అన్నింటా నెంబర్‌వన్‌గా వ్ఞండాలన్న పట్టుదలతో చదువ్ఞ తున్నందున సంతోషమే. అయితే ఆ రెండు గుణాలే ఆమెకు సమస్యగా మారాయి. తన తెలివితేటల్ని చాటుకోవాలి. అన్నింటా ముందు వ్ఞండాలనుకోవడం వల్ల తనను తాను ఎక్కువగా ఊహించుకున్నది. ఆమె చదివిన పాఠశాలలో ఆమె ప్రధమశ్రేణి విద్యార్థి అయివ్ఞండవచ్చు. అంతమాత్రాన కాలేజీలోను, జీవితంలోను తానే గొప్పగా ఉండటం సాధ్యం కాదు. కాలేజీలో తనకంటే తెలివితేటలు వ్ఞన్నవారు చేరుతారు. ఈమెలాగే ఎవరి పాఠశాలలో వారు ప్రధమస్థానం వచ్చినవారై వ్ఞంటారు. దీంతో పోటీ పెరుగు తుంది. కాలేజీలో చేరగానే ఆమెకు ఆ విషయం అర్ధమయి వ్ఞంటుంది. అయినా నెంబర్‌వన్‌ కావాలన్న తన లక్ష్యాన్ని వీడలేక, సర్దుకోలేక మానసిక సంఘర్షణకు గురై వ్ఞంటుంది. క్లాసులో వెనుకబడుతున్నాని తెలిసిన కొద్దీ ఆమెలో భయం, ఆందోళన ప్రారంభం అయి వ్ఞంటుంది. దీంతో తీవ్రస్థాయి ఒత్తిడికి గురైంది.

మానసిక ఒత్తిడివల్ల ఆకలి మందగించడం జరి గింది. ఆందోళన వల్ల ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలేచి చదవడం ప్రారంభిం చింది. ఈ రెండింటివల్ల శరీరంలో శక్తి సామర్థ్యాలు దెబ్బతిన్నాయి. నీరసం, నిస్పృహ ఆవహించాయి. రాను,రాను తలనొప్పి, కంటి సమస్యలు తలెత్తాయి. అన్ని వెరసి డిప్రెషన్‌కు దారితీశాయి. ప్రస్తుతం ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో వ్ఞన్నట్టు అర్ధమవ్ఞతున్నది. కాబట్టి సైకాలజిస్టు ద్వారా కౌన్సెలింగ్‌ చేయించడం తప్పనిసరి. సైకాలజిస్టు మొదటి ఆమె దృక్పధంలో మార్పుతెస్తారు. జీవితాంతం, అన్నింటా తానే ప్రధమస్థానంలో వ్ఞండటం అసాధ్యమన్న విషయం ఆమెకు బోధపరుస్తారు. జీవితంలో గెలుసు, ఓటములు సమాన మని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, గెలుపుకు బాటలు వేసుకోవడంపై అవగాహన కల్పిస్తారు. చిన్న, చిన్న ఉపశమనపద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గిస్తారు. ఓటమిని తట్టుకోవడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం నేర్పుతారు. ఒకవేళ కౌన్సెలింగ్‌తో పూర్తిస్థాయి మార్పురాకుంటే మాత్రం సైకియాట్రిస్టును కలిసి మందులు వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు రోజు కనీసం అరగంట యోగ లేదా వ్యాయామాలు చేయించండి. సమతుల ఆహారం సమకూర్చండి. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా జాగ్రత్తపడండి. కొద్దిరోజుల్లో ఆమె మామూలు స్థితికి వస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యం కుదుటపడి పట్టుదలతో చదివితే డాక్టరు అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. పిల్లలకు లక్ష్యాలు నిర్దేశించడంతోపాటు ఓటమిని తట్టుకోవడం కూడా నేర్పాలని గుర్తించండి.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి,సైకాలజిస్టు