లక్షకోట్ల బాండ్ల మార్కెట్‌ ఎటువైపు పయనం?

Buy & Sell
Buy & Sell

ముంబయి: బాండ్లమార్కెట్‌నుంచి బ్యాంకింగ్‌రంగం వైదొలుగుతోంది. మార్కెట్లలో ఉన్న సమస్యలు నష్టాలు రిటర్నులు పెంచవన్న భావన వ్యక్తం అఈవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పరిమితి అయిపోయిందని బాండ్లమార్కెట్‌పై దృష్టిపెట్టడంలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏప్రిల్‌లో జారీ కానున్న 4.6 లక్షలకోట్ల బాండ్లను ఎవరు కొనుగోలుచేస్తారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీ పోర్టుఫోలియోఇన్వెస్టర్లు మొత్తం బాండ్లలో ఐదుశాతం కొనుగోలుచేస్తున్నారు. మొత్తం బకాయిల్లో 4.5శాతం విదేశీ పోర్టుఫోలియోఇన్వెస్టర్లదే ఉంది. దేశీయ డెట్‌రంగం ఎక్కువ విదేశీ హస్తాల్లో ఉంటే అస్థిరత్వాన్ని పెంచుతుందన్న భావన ఉంది. అయితే మార్కెట్‌ మాత్రం ప్రభుత్వం విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లనుసైతం డెట్‌మార్కెట్‌కు కొంతప్రోత్సహిస్తుందని అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ నోమురా పరంగాచూస్తే ఐదునుంచి ఆరుశాతం వరకూ మాత్రమే మొత్తం డెట్‌రంగంలో వాటా ఉంటుందని, ఈపరిమితి రూ.80వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని అంచనావేసింది. ఇన్వెస్టర్‌ క్లాస్‌పైనే ఆధారపడటాన్ని తగ్గిస్తుందన్న అంచనాలువేసింది.మధ్యకాలికంగా మార్కెట్లకు ఎంతో ప్రయోజనకరమవుతుందని అంచనా. స్థానిక బ్యాంకులుసైతం ఈ రుణపరపతి పథకానికి మద్దతివ్వవచ్చని అంచనావేసింది. బ్యాంకులు తిరిగి బాండ్ల మార్కెట్లకు వస్తాయన్న అంచనాలు సైతం నోమురా వెల్లడించింది. పదేళ్ల బాండ్ల రాబడులు పది బేసిస్‌ పాయింట్లు తగ్గాయి. మందస్తు పన్ను చెల్లింపుల వ్యవస్ఖథ వ్యవస్థలోని మొత్తం నగదు లభ్యతను దెబ్బతీసింది. అడ్వాన్సు పన్నుపరంగా 55వేల కోట్లు లభ్యత అవసరం అవుతుందని అంచనావేసింది. రిజర్వుబ్యాంకు సెకండరీ మార్కెట్‌నుంచి కొత్త ఆర్ధికసంవత్సరంలోనే బాండ్లను కొనుగోలుచేస్తుందని డీలర్లు చెపుతున్నారు. ఆర్‌బిఐ లక్షకోట్ల విలువైన బహిరంగ మార్కెట్‌ లావాదేవీలు నగదులభ్యతను పూర్తిగా తమవైపునకు లాగేసింది. ఇపుడు ఆర్‌బిఐ మార్కెట్లమద్దతుకోసం అయినా బాండ్లను కొనుగోలుచేయాలిస ఉంటుంది. బాండ్‌మార్కెట్‌ ఎక్కువగా బ్యాంకులు, బీమా కంపెనీలపై ఆధారపడే నడుస్తుందని నోమురా అంచనావేసింది. ఈ ఆర్ధికసంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో వాణిజ్యబ్యాంకులు 54శౄతం, బీమా కంపెనీలు 33.4శాతం, విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 17.8శాతం కొనుగోలుచేసాయి. వాణిజ్యబ్యాంకులపరంగా 41.4శాతం దేశీయ బాండ్ల వాటాతో ఉన్నాయి. ఆ తర్వాత బీమా కంపెనీలు 23.6శాతం వాటాతోఉన్నాయి. ఆర్బఇఐ ఓపెన్‌ మార్కెట్‌ కార్యకలాపాలతో విక్రయాలు భారత బాండ్ల రాబడులను పెంచాయి. త్రైమాసిక గణాంకాలనుచూస్తే మూచువల్‌ఫండ్‌ రంగం మూడోత్రైమాసికంలో బాండ్ల అమ్మకాలకు ఎక్కువ ఆసక్తి చూపించిందని నోమురా అంచనా. బాండ్ల మార్కెట్లలో వివిధ బ్యాంకుల వాటానుచూస్తే వాణిజ్యబ్యాంకులు 41.4శాతం, బీమా సంస్థలు 23.6శాతం, ఆర్‌బిఐ 11.9శాతం, ఇతరులు 6.9శాతం, పిఎఫ్‌ సంస్థలు 5.3శాతం, ఎఫ్‌పిఐలు 4.5శాతం, సహకార బ్యాంకులు 2.7శాతం, మూచువల్‌ఫండ్స్‌ 1.3శాతం, కార్పొరేట్లు 1.1శాతం, ఆర్ధికసంస్థలు 0.8శాతం చొప్పున కొనుగోలువాటా ఉన్నట్లు నోమరా విశ్లేషించింది.