లండన్‌ బాబులు ఫస్ట్‌ లుక్‌!

london babul1u
london babul1u

లండన్‌ బాబులు ఫస్ట్‌ లుక్‌!

మారుతి టాకీస్‌, ఎవిఎస్‌ స్టూడియోస్‌ సమర్పణలో ప్రముఖ దర్శక, నిర్మాత మారుతి నిర్మాతగా, చిన్ని కష్ణ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం లండన్‌ బాబులు. తమిళం లో విజ§్‌ుసేతుపతి, రితికా సింగ్‌ కలసి నటించిన ఆండవన్‌ కట్టాలై చిత్రాన్ని తెలుగు లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేశారు. త్వరలోనే ట్రైలర్‌ ను రిలీజ్‌ చేయనున్నారు. జూన్‌ ఎండింగ్‌ లో చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత మారుతి మాట్లాడుతూ.. ఈ చిత్రం తమిళంలో చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్‌ నచ్చి ఈ చిత్రాన్ని తెలుగులో చేస్తున్నాము. చిన్నికష్ణ కామెడి టైమింగ్‌ కూడా ఈ చిత్రానికి చాలా హెల్ప్‌ అయ్యింది. స్వాతి మీడియోలో యాంకర్‌ గా సోసైటి పట్ల భాద్యత కలిగిన పాత్రలో చాలా బాగా చేసింది. రక్షిత్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. కొత్త వాడిలా కాకుండా సీనియర్‌ నటుడిగా పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో ఒక్కోక్కరి పాత్ర చిత్ర కథని మలుపులు తిప్పుతూ చివరకి హీరో లండన్‌ ఎలా వెళ్ళాడనేది ముఖ్యకథాంశం. ప్రతిపాత్రకు ఇంపార్టెన్స్‌ ఇస్తూ దర్శకుడు చాలా కొత్తగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి శ్యామ్‌.కె.నాయిడు కెమెరా, ఉద్దవ్‌ ఎడిటింగ్‌ మరో ఎసెట్‌ గా నిలుస్తాయి. అతిత్వరలో ట్రైలర్‌ ని , జూన్‌ లో ఆడియోని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము అని అన్నారు