ర‌హ‌స్యాన్ని ఛేదించే క్ర‌మంలో..

MANCHU LAXMI
MANCHU LAXMI

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలోనటించిన సినిమా వైఫ్‌ ఆఫ్‌ రామ్‌.. విజ§్‌ు యెలకంటి దర్శకుడు.. ఇది ఒక సైకలాజికల్‌ ఇంటెలిజెంట్‌ థ్రిల్లర్‌ ఊహించని మలుపులతో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన సినిమా.. అందుకు తగ్గట్గ్టుగానే విడుదలచేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.. ఏకంగా దర్శకధీరుడు రాజమైళి కూడ ఈ ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రీసెంట్‌గా ఒట్టావా ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో అఫీషియల్‌ ఎంట్రీ సాధించినసినిమా.. ఒఎన్‌జిసిలో పనిచేసే దీక్ష అనే యుతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త హత్యకు గురవుతాడు.. ఆ రహస్యాన్ని ఛేదించే రకమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటీ అనేది కథ.. ఈక్రమంలో వచ్చే ఒక్కో సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు విజ§్‌ుపేర్కొన్నారు.. చిత్రం సెన్సార్‌ పనులు పూర్తిచేసుకుని ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.. సెన్సార్‌ సభ్యులు యుబైఎ సర్టిఫికెట్‌ అందించారు..