ర‌ష్యా దౌత్య‌వేత్త‌ల‌ను బ‌హిష్క‌రించిన అమెరికా

TRUMP, PUTIN
TRUMP, PUTIN

60 మంది రష్యా దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. సీటెల్‌లోని రష్యా దౌత్యకార్యాలయం మూసివేయాలని కూడా ట్రంప్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్‌ గూఢాచారిపై దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా, యూరప్‌ దేశాలు రష్యాపై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ తాజాగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఏడు రోజుల్లో వీరంతా అమెరికా వీడిపోవాలని ఆదేశించింది. రష్యా దౌత్యవేత్తలు గూఢాచర్య కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలను ట్రంప్‌ కార్యాలయం చేసింది. బ్రిటన్‌ ఇప్పటికే 23 మంది రష్యా దౌత్యవేత్తలను తమ దేశం నుండి బహిష్కరించింది.