ర‌ష్యా అధ్య‌క్షుడు ఫుతిన్‌ను ఆహ్వానించిన ట్రంప్‌

TRUMP, PUTIN
TRUMP, PUTIN

ఈ ఏడాది చివరలో చర్చలు జరిపేందుకు తమ దేశం రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ఆహ్వానించారు. గత వారం హెల్సింకిలో తొలిసారిగా పుతిన్‌తో చర్చల అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ద్వైపాక్షిక ఎదురుదెబ్బ అనే విమర్శలు రావడంతో వైట్‌హౌజ్‌ ఈ ప్రకటన చేసింది. పుతిన్‌ పర్యటనపై చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్‌ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ ట్వీట్‌ చేశారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్లు అంచనాకు వచ్చిన ఇంటెలిజెన్స్‌ వర్గాలకు ట్రంప్‌ మద్దతివ్వకపోవడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.