ర‌జ‌నీకి కోర్టు నోటీసులు జారీ

RAJANIKANTH11
RAJANIKANTH11

చెన్నైః సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్‌, దర్శకుడు పా రంజిత్‌ కు మద్రాసు హైకోర్టు నోటీసులు పంపింది. ‘కాలా’ సినిమా టైటిల్‌ను, కథను కాపీ చేశారనే ఆరోపణలపై కోర్టు నోటీసులు జారీ చేసింది. రజనీకాంత్‌ లేటెస్ట్ చిత్రం ‘కాలా’. ధనుష్‌ నిర్మాత. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ కథ, టైటిల్‌ తనదని సహాయ దర్శకుడు రాజశేఖరన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పదేళ్లకు ముందే ‘కాలా కరికాలన్‌’ కథ రాసుకున్నానని, అందులో రజనీకాంత్‌ను హీరోగా తీసుకోవాలని అనుకున్నానని పిటిషన్‌లో చెప్పాడు. ఈ నేపథ్యంలో ‘కాలా’ యూనిట్‌ సభ్యులు ఫిబ్రవరి 12వ తేదీలోపూ సమాధానం చెప్పాలని ఆదేశించింది కోర్టు.