రోహింగ్యాల పిటిష‌న్ విచార‌ణ‌కు సుప్రీం అంగీకారం!

supreem court
supreem court

ఢిల్లీః రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు పంపించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రోహింగ్యా ముస్లింలు దాఖలు
చేసిన పిటిషన్‌ విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ నెల 13న ఈ విషయంపై విచారణ చేపట్టనుంది. న్యాయ సూత్రాలను
అనుసరించి మాత్రమే వాదనలు వింటామని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌
మిశ్ర, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం వాద ప్రతివాదులకు కొన్ని సూచనలు చేసింది. ఈ
కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలను, అంతర్జాతీయ ఒప్పందాలను సమర్పించి న్యాయస్థానానికి సాయపడాల‌ని సుప్రీం ఈ
సంద‌ర్భంగా సూచించింది.