రోడ్డు ప్ర‌మాదానికి గురైన ఎమ్మెల్యే ఉమేష్‌

B N
B N

కర్ణాటక ఎమ్మెల్యే ఉమేష్‌ జాదవ్‌ కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్నబొలెరో వాహనాన్ని కర్ణాటకలోని పోలక్‌పల్లి వద్ద వెనకే వస్తున్న గ్జైలో బండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తాండూర్‌ మండలం కొత్లాపూర్‌లోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ఉమేష్‌ స్నేహితుడు జనార్దన్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇద్దరిని హుటాహుటిన చించోలీ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కారుకు అడ్డుగా వచ్చిన ఆవును తప్పించే క్రమంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.