రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు మృతి

Road Accident
Road Accident

మహబూబ్‌నగర్‌: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన జడ్చర్ల సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆటో, లారీ ఢీకొనడంతో ఐదుగురు అక్కడిక్కడే మృత్యువాత చెందారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను శవపంచనామా నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.