రోడ్డు ప్రమాదంలో 27 మంది సజీవదహనం

27 burn to death in bus-truck
27 burn to death in bus-truck

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో బలూచిస్థాన్‌లోని హబ్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంధనం నింపుకొని వెళ్తున్న ట్రక్కు, బస్సు ఒక్కదానితో ఒక్కటి ఢీకోనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కరాచీ నుండి పంజ్‌గురుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది సజీవ దహనమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.