రోడ్డు నాణ్యత విషయంపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారు

PAWAN KALYAN
PAWAN KALYAN

పోలవరం ప్రాజెక్టు దగ్గర ఒక కిలోమీటరు రోడ్డు మార్గంలో పగుళ్లు ఏర్పడడంపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. రియల్‌ టైం గవర్నెన్స్‌ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు రోడ్డు నాణ్యత విషయంపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర రోడ్డు మార్గంలో ఏర్పడిన పగుళ్లకు సంబంధించిన వీడియోను పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.