రోజూ అయిదు నిమిషాలు పరుగు

RUN
RUN


చిన్నప్పుడు మనమంతా పరుగులు పెట్టిన వాళ్లమే. రకరకాల ఆటలు ఆడతాం. అందువల్ల ఆరోగ్యంగా ఉండటమకాదు, ఫిజికల్‌గా కూడా ఫిట్‌గా ఉండేవాళ్లం. మరి ఎదిగేకొద్దీ ఎన్నో బాధ్యతలు. ఉద్యోగాలు, పనులు, టైమ్‌ ఉండని పరిస్థితి. ఇలాంటి రోజుల్లో కూడా కొంత మంది టైమ్‌ కేటాయించి వాకింగ్‌ చేస్తుంటారు. వాకింగ్‌ మంచిదే. బాడీలో చాలా అవయవాలు అటూ ఇటూ కదిలి, కొవ్వు కరిగి ఆరోగ్యం పెరుగుతుంది. అయితే వాకింగ్‌ కంటే జాగింగ్‌ ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందంటున్నారు డాక్టర్లు. ఏ మాత్రం టైమ్‌ లేని వాళ్లు రోజూ కనీసం 5 నిమిషాలైనా పరిగెడితే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో నిద్ర మత్తు ఎక్కువగా ఉండే రోజుల్లో వాకింగ్‌ చేసే టైమ్‌ లేనప్పుడు జాగింగ్‌తో ఫిట్‌నెస్‌ పెంచుకోవచ్చంటున్నారు. పైగా చలికాలంలో తినే హల్వా, పరాఠా వంటి ఆహారపదార్థాల్లో కేలరీలు ఎక్కువ. అవి బరువు పెరిగేలా చేస్తాయి. అధిక బరువు ఎప్పుడూ నష్టమే. అందువల్ల 5 నిమిషాల జాగింగ్‌ చేస్తే మంచిది. రన్నింగ్‌ వల్ల బాడీ మొత్తం షేక్‌ అవుతుంది. కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. నిజంగా బరువు తగ్గాలంటే అయిదు నిమిషాల రన్నింతోనైనా కేలరీలు, కొవ్వు కరిగించుకోవచ్చు. రోజు ఎన్ని కేలరీల శక్తి వస్తుందో అంత కంటే ఎక్కువ కేలరీ శక్తి ఖర్చయితేనే బరువు తగ్గుతాం. సరిపడా వాకింగ్‌, జాగింగ్‌, వర్కవుట్స్‌ చేస్తే మంచిది. ఉదయాన్నే జాగింగ్‌కి వెళితే పచ్చటి ప్రకృతి, సూర్యకిరణాలు, పక్షుల అరుపులు, చక్కటి వాతావరణం ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. అది తలనొప్పిని తగ్గిస్తుంది. బాడీకి, బ్రెయిన్‌కి ఎక్కువ ఆక్సిజన్‌ అందేలా చేస్తుంది. డిప్రెషన్‌ తగ్గుతుంది. రెగ్యులర్‌గా జాగింగ్‌ చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిక్‌ పేషెంట్లు 5 నిమిషాలు కేటాయించి వీలైనంతగా పరుగులు పెడితే బ్లడ్‌లో షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోకుండా తగ్గిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేందుకు వీలువుతందంటున్నారు నిపుణులు. 5 నిమిషాల పరుగుతో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో పేరుకున్న కొవువ నిలువలు కరిగిపోయి రక్తసరఫరా సరిగ్గా ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/