రోజా కేసు తీర్పుపై టిడిపి స్ట్రాటజీ కమిటీ సమావేశం
రోజా కేసు తీర్పుపై టిడిపి స్ట్రాటజీ కమిటీ సమావేశం
హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసు కోర్టు తీర్పుపై టిడిపి స్ట్రాటజీ కమిటీ ఇవాళ భేటీ అయ్యింది. రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీ సభ్యులు చర్చించారు. సెక్షన్ 340(2) ప్రకారం సస్పెన్షన్ చేయడాన్ని కోర్టు తప్పబట్టింది. రాజ్యాంగంలోని 212 నిబంధన ప్రకారం అసెంబ్లీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమన్న విషయాన్ని తీర్పులో పేర్కొంది. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ రోజాపై చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ తీర్పు అడ్డుకోలేదని జడ్జిమెంట్‌పై స్ట్రాటజీ కమిటీ అభిప్రాయపడింది.