రొయ్యల మామిడి కూర

royala mamde kura
royala mamde kura


కావలసినవి
రొయ్యలు అరకిలో పచ్చిమామిడికాయలు చిన్నవి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయాలు మూడు వెల్లులి తురుము రెండు టీస్పూన్లు అల్లం తురుము ఒక టీస్పూన్‌ అవాలు అరటీస్పూన్‌ కారం ఒక టీస్పూన్‌ మంచినీళ్లు ఆరలీటరు
తయారుచేసే విధానం రొయ్యల్ని శుభ్రం చేసి కడగాలి మామిడికాయల్ని తొక్కతీసి చిన్నముక్కలుగా కోయాలి బాణలిలో నూనె వేసి కాగాక అవాలు మెంతలు అల్లం వెల్లుల్లి తురుము వేసి వేయించాలి తరువాత ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి కరివేపాకు టమట ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకూ ఉడికించాలి తరువాత మామిడికాయ ముక్కలు ధనియాల పోడి కారం పసుపు వేసి ఉడికించాలి.మసాలా వాసన వస్తుండగా రోయ్యలు వేసి ఓ నిముషం వేయించాలి తరువాత నీరు పోసి పదిహేను నిమిషాల పాటు ఉడికించి దించే ముందు కొత్తిమీర చల్లితే రుచికి చాలా బాగుంటుంది