రైళ్లలో సీట్ల కేటాయింపుపై పిల్‌

SEATING ARRANGEMENT
SEATING ARRANGEMENT

అహ్మదాబాద్‌: రైళ్లలో శాఖాహారులు, మాంసాహారులకు వేర్వేరుగా సీట్లు కేటాయించాలని కోరుతూ గుజరాత్‌ హైకోర్టులో ఓ వ్యక్తి పిల్‌ దాఖలు చేశాడు. అలా చేయడం వల్ల రైళ్లలో ప్రయాణించే శాఖాహారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండబోదంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌లో వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌కు చెందిన 67 ఏళ్ల సయూద్‌ అనే వ్యక్తి రైళ్లలో వెజిటేరియన్‌, నాన్‌వెజిటేరియన్‌ వారీగా సీట్లు కేటాయించాలని కొరాడు. ప్రయాణికులు టికెట్‌ కొనే సమయంలోనే వాళ్లు వెజ్జా లేదా నాన్‌వెజ్జా అనేది తెలుసుకుని సీట్లు కేటాయించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు న్యాయస్థానం రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కొరాడు. ఇలా చేస్తే ఆహారపదార్దాల సరఫరా చేసే సమయంలో కూడా క్యాటరింగ్‌ సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని పిటిపనర్‌ చెప్పాడు. ఈ పిటిషన్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ, ఐఆర్‌సిటిసి, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం , పశ్చిమ రైల్వే జోన్‌లను ప్రతివాదులుగా చేర్చారు.