రైల్వేలకు రూ.64 వేల 587 కోట్లు

RAILWAYS
RAILWAYS

న్యూఢిల్లీ: రైల్వే రంగానికి బడ్జెటరీ సపోర్టు కింద రూ. 64 వేల 587 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. మిజోరాం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశామన్నారు. రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది అని స్పష్టం చేశారు. బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించామని తెలిపారు. ఈశాన్య భారతానికి కూడా మౌలిక రంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నామని చెప్పారు. సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నామన్నారు. బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకు రవాణా అవుతుందన్నారు.