రైల్వేలకు రూ.50వేల కోట్ల ప్రతిపాదనలు

rail
Railways

రైల్వేలకు రూ.50వేల కోట్ల ప్రతిపాదనలు

 

న్యూఢిల్లీ, జనవరి 22: రైల్వేమంత్రిత్వశాఖకు కొత్త బడ్జెట్‌పరంగా రూ.50 వేల కోట్ల రూపాయలు అవస రం అవుతాయని ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి 40 వేల నుంచి 45 వేల కోట్ల వరకూ బడ్జెట్‌మద్దతు లభించగలదని సీనియర్‌ అధికారులు చెపుతున్నారు. స్థూల బడ్జెట్‌మద్దతు కింద ఈసారి బడ్జెట్‌లో 50వేల కోట్లు అవసరం అవుతుందని అయితే ప్రభుత్వం మాత్రం 45వేలకోట్లకు మించి ఇవ్వలేదని వాస్తవానికి రైల్వేలు 30వేల కోట్లకు మించి సొంతవ నరులు సమకూర్చుకోలేవని ఆయన అన్నారు. 2015-16 బడ్జెట్‌లోనే 40వేల కోట్ల బడ్జెట్‌ మద్దతులభించింది. అయితే ఆర్థిక శాఖ మాత్రం ప్రస్తుత సంవత్స రంలో 28వేల కోట్ల రూపాయలు కుదించింది. నిధుల ఖర్చులో మందగమనం ఉందని అంచనావేసింది. 92 ఏళ్ల పాతసాంప్రదాయానికి చెక్‌పెడుతూ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 21వ తేదీ రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనంచేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఫిబ్రవరిఒకటవ తేదీనే బడ్జెట్‌ను ప్రతిపాదించాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం కూడా ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయ వర్గీకరణ స్థానంలో మూలధనం, రాబడులు కింద వర్గీకరణ చేసింది.