రైల్వేకు రూ.64,587 కోట్లు

railways
railways

ఛార్జీల పెరుగుదల లేదు…

భద్రతకు పెద్ద పీట, లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద కాపలా పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో 2018-2019 ఏడాదికిగానూ రైల్వేకు రూ.64,587 వేల కోట్ల రూపాయలను కేటాయింపు జరిగింది. రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో కలిపాక తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో కేటాయింపులు జరగడం గమనార్హం. ఈ బడ్జెట్‌లో ఛార్జీల పెరుగుదల లేకపోగా, లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద కాపలాను మరింత పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన సందర్భంగా వెల్లడించారు. రైల్వేలో భద్రతకు మరింత పెద్దపీట వేస్తామని, ఇందుకోసం తగినన్ని నిధులను మంజూరు చేస్తామని, ఇదే సమయంలో బ్రాడ్‌గేజ్‌ లైన్‌ల వద్ద కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద కాపలా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని గోయల్‌ తెలిపారు. భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సెమీ హై స్పీడ్‌తో పయనించనుందని, ఇందులో ప్రయాణించే ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని గోయల్‌ తెలిపారు. మేక్‌ ఇండియాలో భాగంగా రైల్వేలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని, నిరుద్యోగులకు ఇంది ఎంతగానో మేలు చేస్తుందని ఆయన చెప్పారు. రైల్వేలో అధు నాతన టెక్నాలజిని అమల్లోకి తేనున్నామని, దీనివల్ల రైళ్ల సమయపాలన సవ్యంగా వుండడంతో పాటు ప్రయాణీకులు సకాలంలో గమ్య స్థానాలకు చేరుకునేందు కు వీలుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం వున్న 96.2 ఆపరేషన్‌ నిష్పత్తిని త్వరలో 95 శాతానికి పెంచనున్నామని ఆయన తెలిపారు. ఈసారి రైల్వే బడ్జెట్‌లో ఛార్జీల పెరుగుదల లేదని ఆయన వెెల్లడించారు. రైల్వేలో ప్ర ణాళికా ఖర్చులు 2014 నుంచి 148 శాతం పెరిగాయని గోయల్‌ లోక్‌సభకు తెలిపారు.