రైలు ప‌య‌నంలో న‌టిపై లైంగిక వేధింపులు

B N
B N

తిరువనంతపురం: మలయాళ నటి లైంగిక వేధింపులకు గురైంది. కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్లే రైలులో నటి ప్రయాణిస్తుంది. బెర్త్‌పై పడుకుని ఉండగా ఆమెకు ఎదురుగా ఉన్న బెర్త్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నటిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. విషయంపై మీడియా ద్వారా స్పందిస్తూ.. నా పెదాలను ఎవరో తాకుతున్నట్లుగా అనిపించి కండ్లు తెరిచి చూశా. అతడు నా పెదాలను రుద్దడాన్ని గమనించి చేతులను పట్టుకున్నా. వెంటనే లైట్లు వేసి సహాయం కోసం పిలిచా. ఏ ఒక్కరూ రాలేదు. నేనే టికెట్ కలెక్టర్ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పా. అతను పోలీసులను పిలిచి నిందితుడిని అప్పగించాడని నటి పేర్కొంది.