రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

Suicide
Suicide

హైదకాబాద్‌: జీవితంపై విరక్తి చెంది ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చర్లపల్లి,ఘట్కేసర్‌ రైల్వేస్టేషన్ల నడుమ రైలు పట్టాలపై ఓ వ్యక్తి పడి ఉన్నాడని సమాచారం అందింది. సంఘటన స్థలానికి తరలివెళ్లిన పోలీసులకు సుమారు 20వయస్సుగల యువకుడి మృతదేహాం గోచరించింది. తల,మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. మృతదేహాం పడి ఉన్న తీరును బట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తులో మృతుడు పేరు గాజుల మహేశ్‌(24) నగరంలోని మహావీర్‌ హాస్పిటల్‌లో మేల్‌ నర్స్‌గా పనిచేస్తుండేవాడని మాత్రమే తెలిసింది. మృతుడి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.