రైతు సమన్వయ సమితికి రైతుబంధు చెక్

MAHESH BIGALA
MAHESH BIGALA

రైతు బంధు చెక్ లను తిరిగి ఇచ్చేయండి అని ఎన్నారైలకు పిలుపునిచ్చిన భాగంగా ఈ రోజు టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల నిజామాబాదు జిల్లా లోని మాక్లూర్ గ్రామంలో తన కుటుంబానికి ఉన్న భూమికి వచ్చిన చెక్ ను స్థానిక ఎంఆర్ఓ కి తన తండ్రి కృష్ణమూర్తి గారితో కలసి రైతు సమన్వయసమితికి ఇవ్వడం జరిగింది. దేశంలోని ఏ రాష్ట్రం లో ఇలాంటి పథకం అమలులో లేదని దీనిని తెలంగాణ రాష్ట్రం అమలు చేసినందుకు సీఎం కెసిఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, విదేశాలలో స్థిరపడ్డ ఎన్నారైలు కూడా ఇదే విధంగా వారి పెట్టుబడిని తిరిగి ఇచ్చి టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి, రైతన్నకు అండగా నిలవాలని మల్లి పిలుపునిచ్చారు.