రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడ‌తాంః సంప‌త్‌

sampath kumar
sampath kumar

హైదరాబాద్: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతామని అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే అర్హత ప్రతిపక్ష పార్టీకి ఉందన్నారు. విపక్షాలతో చర్చించి అవిశ్వాసంపై నిర్ణయం తీసుకుంటాన్నారు. అలాగే రైతు రుణమాఫీపై సీఎం ప్రకటన చూస్తే రైతు వ్యతిరేక ప్రభుత్వమని తేలిపోయిందని ఆయన అన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ అందలేదని రుజువుచేస్తామని ఆయన అన్నారు.