రైతు రుణమాఫీని అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

Arun Jaitley
Arun Jaitley

న్యూఢిల్లీ: తెలంగాణ సిఎం కెసిఆర్‌ పరిపాలనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిని విషయం తెలిసిందే. అయితే దేశంలో రైతు రుణమాఫీని అత్యంత సమర్థవంతంగా అమలు చేసిని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేంద్ర శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఏడెనమిది రాష్ట్రాలు రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయలేదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికి అభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో ఉందని, రైతును రాజు చేయాలనే సంకల్పంతో.. రైతుబంధు పథకానికి సిఎం కెసిఆర్‌ శ్రీకారం చుట్టి ఆ పథకాన్ని దేశానికే దిక్సూచిలా చేశారని  జైట్లీ పేర్కొన్నారు.