రైతుల‌కు పావ‌లా వ‌డ్డీ అంద‌డం లేదుః కిష‌న్‌రెడ్డి

Kishan Reddy
Kishan Reddy

హైద‌రాబాద్ః రైతులకు పావలా వడ్డీ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆ పథకం రైతులకు చేరడం లేదని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కోరారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాలకు కూడా వడ్డీ మాఫీ రావడంలేదని, ఇది సకాలంలో చెల్లించని కారణంగా అది 11 శాతం పెరిగి రైతులపై భారం పడుతోందని అన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్స్‌కు నిధులు ఇవ్వని కారణంగా, అరకొర నిధులతో పనులు జరగక ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇదే చివరి బడ్జెట్ సమావేశం కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు.