రైతులు సంఘటితం కావాలి: ఎంపీ కవిత

KAVITHA
KAVITHA

నిజామాబాద్‌: తెలంగాణ ఉద్యమం తరహాలో రైతులు సంఘటితం కావాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా గన్నారంలో జరిగిన రైతు సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. పంటల ఎంపిక, సాగు మెళకువలు, మార్కెటింగ్‌ నైపుణ్యం పెంచుకోవడం వల్ల రైతులు అభివృద్ధి చెందుతారని అన్నారు. నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌కు ప్లాట్‌ ఫాం నిర్మాణ పనులను అప్పగించారు.ముఖ్యమంత్రి రైతులను ఆర్థికంగా బలపడేలా చేసేందుకు రైతు సమాఖ్యల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయిస్తుందని అన్నారు. నీళ్లు, కరంటు ఉంటే రైతులు పంటల సాగులో ఇబ్బంది పడరనీ, కరంటు సరఫరాలో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు వచ్చాయన్ని కవిత చెప్పారు.