రైతులకు తక్షణమే డబ్బు చెల్లింపు

TSCM Kcr
TSCM Kcr

రైతులకు తక్షణమే డబ్బు చెల్లింపు

హైదరాబాద్‌: ఎఫ్‌సిఐ నుంచి రావాల్సిన డబ్బులు వచ్చేంతవరకూ ఎదురుచూడకుండా రూ.వెయ్యికోట్లు సమకూర్చుకోవాలని, ప్రభుత్వం తరపున బ్యాంకు గ్యారెంటీ అని సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు.. రాష్ట్రంలో ఇప్పటివరకు 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని,, మొత్తం రూ.5300 కోట్లకు చెల్లింపులు జరపాల్సి ఉండగా, రూ.వేల కోట్లు చెల్లించామని అన్నారు.. ఖరీఫ్‌ పెట్టుబుడులకు రైతులకు డబ్బులు అవసరం కాట్టి రైతుల చెల్లింపులపై ఎక్కువ దృష్టిపెట్టాలన్నారు.. దీనిపై రాష్ట్రస్థాయి అధికారులు ఎప్పటికుపుడు సమీక్షించాలన్నారు.

రైతులకు డబ్బులందేవిధంగా చర్యలు

ధాన్యం సేకరణకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, ఎప్పటికపుడు రైతులకు చెల్లింపులు జరపాలని కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు.. శనివారం ఆయన ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు.. చరిత్రలో ఎన్నడూలేనంతగా ఈసారి రైతులకు పంట చేతికందిందని అన్నారు.. సివిల్‌ సప్లయిస్‌ కొనుగోలు కేంద్రాలకు రికార్డుస్థాయిలో ధాన్యం వస్తోందన్నారు.. ఎంత ధాన్యమైనా సేకరించటానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.. ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు డబ్బులందేవిధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అదికారులను సిఎం ఆదేశించారు.