రైతురుణమాఫీకి రూ.34వేల కోట్లు

K'taka Budget
K’taka Budget

బెంగళూరు: కర్ణాటక సంకీర్ణప్రభుత్వం తాజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సంకీర్ణప్రభుత్వ ముఖ్యమంత్రి కుమారస్వామి రైతురుణమాఫీకి రూ.34వేల కోట్లు కేటాయించారు. బకాయిలు లేని రైతులు రూ.25వేలు చొప్పున సాధించుకోగలరని వెల్లడించారు. ప్రతిరైతు రుణం గరిష్టంగా రెండులక్షలవరకూ మాఫీచేయనున్నట్లు ప్రకటించారు. సంకీర్ణ ప్రభుత్వానికి రుణమాఫీ ప్రధాన బాధ్యత అని ఇందుకుసంబంధించి నిధులు సమీకరిస్తున్నామని,అనవసర ఖర్చులపై కోత విధించామని కుమారస్వామి వెల్లడించారు. ఆర్ధికశాఖను స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షిసుత్నఆ్నరు. రైతులు కొత్తగా రుణాలు పొందేందుకు చర్యలు తీసుకుంటునానమని, ప్రభుత్వం రుణమాఫీ బకాయిలు క్లియర్‌ అయినట్లు సర్టిఫికేట్‌ ఇస్తుందని, వారికి కొత్త రుణాలిస్తారన్నారు. ఇందుకోసం రూ.6500 కోట్లు 2018-19 ఆర్ధికసంవత్సరం బడ్జెట్‌లో కేటాయించామన్నారు.మొదటి విడత రుణమాఫీ కింద 2017 డిసెంబరు 31వ తేదీవరకూ ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇక బకాయిలేని రైతులు తమ రుణాలను నిర్ణీత వ్యవధిలో చెల్లించినవారికిసైతం రూ.25 వేలు చొప్పున జమచేస్తామని వెల్లడించారు. అన్నభాగ్య ఉచిత బియ్యంపథకం, క్షీరభాగ్య పాఠశాల విద్యార్ధులకు భోజనం వంటివి సిద్దరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటిని యధాతథంగా కొనసాగిస్తామని, ప్రస్తుత ప్రభుత్వం మరికొన్ని పథకాలు అమలుకు తెస్తుందన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు 2016-17లొ 7.5శాతంగా ఉందని, 2017-18లో 8.5శాతానికి పెరిగిందన్నారు. రుణమాఫీకి సంబంధించి వనరులు సమీకరిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ భారం వల్ల కొంతమేర ప్రభుత్వానికి భారం పెరుగుతుందని, అదనపు వనరులు సమీకరిస్తామన్నారు. పెట్రోలుపై లీటరుకు 1.14, డీజిల్‌పై రూ.1.12 చొప్పున సుంకాలు పెంచామన్నారు. స్వదేశీయ తయారీ విదేశీ మద్యంపై సుంకం నాలుగుశాం పెంచామని, 18 శ్లాబ్‌లలో నాలుగుశాతంపెరుగుతుందన్నారు. అన్నిరకాల పంటరుణాలను రైతులకు రద్దుచేస్తామని, పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే 24 గంటల్లోపే వ్యవసాయ కార్యకలాపాలు జోరందుకున్నాయని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఒక మంచి అవకాశం వచ్చిందని, ఈ ప్రభుత్వంలోముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రభుత్వ అధికారులు, సహకారరంగంలోని అధికారులు, రైతులు మూడేళ్లనుంచి ఆదాయపు పన్ను చెలిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌జెడిఎస్‌ సమన్వయకమిటీ ప్రభుత్వం సజావుగా సాగేందుకు కనీస ఉమ్మడి కార్యాచరణ కింద అజెండాను రూపొందించింది. రుణమాఫీ, కోటి ఉద్యోగాల కల్పన, 1.25 లక్షలకోట్లు సాగునీటికి వచ్చే ఐదేళ్లలో ఖర్చుచేసేందుకువీలుగా నిర్ణయాలు తీసుకుంది. పూర్తిస్థాయి బడ్జెట్‌లో గత ప్రభుత్వం కొనసాగించిన అన్ని పథకాలను అమలుచేస్తామని ప్రభుత్వంప్రకటించింది. కోఆర్డినేషన్‌ కమిటీ ఛీఫ్‌ సిద్దరామయ్య గత ప్రభుత్వంలోను ఆర్ధికశాఖను నిర్వహించారు. ఇప్పటివరకూ ఆయన మరో బడ్జెట్‌ అవసరం లేదని తాము ప్రవేశపెట్టామని అన్నారు. ప్రతిపక్ష నేత బిఎస్‌ యెడ్యూరప్ప రుణమాఫీపైనే ఎక్కువ పట్టుబడుతున్నారు. మొత్తం 104 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బిజెపి ఎన్నికల హామీలు అమలుచేయకపోతే ప్రజల్లోనికి వెళతామని సంకీర్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సంకీర్ణప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించారు.