రైతుబంధుపై హైకోర్టులో పిల్‌

HIGH COURT
HIGH COURT

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రైతు బందు పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సాయం వల్ల సామాన్యుల కంటే భూస్వాములకే మేలు జరుగుతుందని నల్గొండ జిఆల్లకు చెందిన యాదవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాసారు. పథకంలో చాలా మార్పులు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు న్యాయ విచారణ జరిపింది. రెండు వారాలలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 10కి కోర్టు వాయిదా వేసింది.
కాగా రైతుబంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా మహోధ్యమంలా కొనసాగుతుంది. ప్రతి గ్రామంలో లబ్దిదారులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రూ.8000లు ప్రభుత్వం ఇస్తుంది. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా ఇస్తున్నారు. సంవత్సరంలో రెండు పంటలకు రూ.4000 చొప్పున రెండు సార్లు ఇస్తారు. ఈ మొత్తాన్ని రైతులు తమ పంట పెట్టుబడిగా వినియోగపడుతుందని ప్రభుత్వం భావించి చెక్కుల రూపంలో రైతులకు అందిస్తుంది. ఈ మొత్తాలను మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఏసిలు, ఎంఎల్‌లతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ రైతుబంధుకు కింద చెక్కులను అందిస్తున్నారు. రైతుబంధు పథకంలో ఎకరాలకు సంబంధించిన నియంత్రణ లేకపోవడంతో ఎన్నిఎకరాలు ఉంటే మొదటి విడదతలో రూ.4000చొప్పున ప్రభుత్వం అందించింది. ఒక్క ఎకరా నుంచి ఎక్కువ ఎకరాలు ఉన్నా ప్రభుత్వం ఇస్తుంది. అయితే చిన్న రైతులకు ఆదుకోవాలంటూ, పెద్ద రైతులకు నిధులు ఎందుకంటూ ఆయన ఆరోపించారు. రైతు బంధు పథకంలో సన్నకారు, చిన్నకారు లబ్ది చేకూరి ఉంటే ఇలాంటి ఆరోపణలు వచ్చేవి కావని, 40-50 ఎకరాలు ఉన్నవారికి కూడా ప్రభుత్వ పరంగా భారీగా నగదు అందటం వల్ల ఆయన ఈ ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. కౌలు రైతులకు ఈ పథకంలో ఎలాంటి లబ్ది లేదు. భూస్వాములకే ఎక్కువ మొత్తాలను ఉన్న చెక్కులు లభించాయి. కనీసం సాగుచేయని పెద్ద రైతులకు ఇలాంటి చెక్కులు రావడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.