రైతును పరామర్శించిన టీజేఏసి చైర్మన్‌

Kodanda ram
Kodanda ram

హైదరాబాద్‌; తీవ్రగాయలు పాలై, యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్గొండ జిల్లాకు చెందిన రైతు జితేంద్ర రెడ్డిని గురువారం టిజేఏసి చైర్మన్‌ కొదండరాం  పరామర్శించారు. ఇటీవలే నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం నర్సిరెడ్డి గూడెంలో, రైతుల భూములకు ఎలాంటి నష్టపరిహారాన్ని చెల్లించకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న రిజర్వార్‌ నిర్మాణాన్ని రైతులు అడ్డుకున్నారని, అప్పుడు రైతులను అమానుషంగా చితకబాది అక్రమ కేసులను పెట్టి జైలుకు పంపించారని టీజాక్‌ అధికార  ప్రతినిధి వెంకట్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అసమయంలో జితేంద్ర రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడని, జైలులోకి తీసుకోవడానికి కూడా జైలు అధికారులు  నిరాకరించారని ఆయన పేర్కొన్నారు.