రైతుకు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలిః కోదండ‌రాం

Kodanda ram
Kodanda ram

వరంగల్‌: గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్లనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. హన్మకొండలో తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో ‘వ్యవసాయరంగ సమస్యలు-పరిష్కారాల’పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కోదండరాం హజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సుమారు 3వేల మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వం రైతులకు 4వేల రూపాయల ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకోవడం కాకుండా పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు 12 గంటల కరెంటు ఇస్తే చాలని 24 గంటల కరెంటు ఇస్తే భూగర్బ జలాలు అడుగంటిపోయి కావాల్సిన సమయంలో నీళ్లు అందక వ్యవసాయం కుదేలు అవుతుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐకాస ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్పారు.